టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఇండస్ట్రీని ఎలా తన అందచందాలతో ఏలేస్తుందో మనకు బాగా తెలిసిన విషయమే . కాగా కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో ఛలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు -పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను అందుకుంది .
అయితే పుష్ప సినిమా తర్వాత ఇప్పటివరకు రష్మిక హిట్ అందుకునింది లేదు. కానీ చేతిలో మాత్రం బడా బడా ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ రష్మిక అంటే పడి చచ్చిపోతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక ఒకవేళ హీరోయిన్ కాకపోతే ఏమై ఉండేది అన్న న్యూస్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్నాయి. అయితే మొదటి నుంచి రష్మిక కి హీరోయిన్ అవ్వాలని ఆశగా ఉండిందట.
చదువు కంప్లీట్ అయిపోగానే ఇటువైపుగా రావాలని ట్రై చేసిందట . ఒకవేళ హీరోయిన్ సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఏదైనా జాబ్ చేసుకొని తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అనుకునేదట . ఇది తెలిసిన అభిమానులు హాట్సాఫ్ రష్మిక అంటున్నారు. అనుకున్నది సాధించావు ఇంకా ఇండస్ట్రీలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక మొండి పిల్లే అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు అమ్మ నాన్న కి బాగా చూసుకుంటుంది..!!