సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించిన తర్వాత ఆ సినిమా హిట్ అయిన అవుతుంది ఫట్ అయినా అవుతుంది. అయితే హిట్ అయినప్పుడు ఆనందపడేవాడు ఫట్ అయినప్పుడు బాధ పడేవాడు రియల్ హీరో కాదు . హిట్ అయినా ఫట్ అయినా సరే ఆ సినిమాలో తన పాత్రను నచ్చి ఇష్టపడే వాడే నిజమైన హీరో అంటున్నారు అభిమానులు. కాగా ఆ క్వాలిటీస్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్నాయి అని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చిన తర్వాత ఆయన తన పేరుని ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. ప్రెసెంట్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలకు సైన్ చేస్తూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తన కెరీర్లో ఒక సినిమా మొత్తం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సినిమా మరేదో కాదు బి.గోపాల్ దర్శకత్వం వహించిన స్టేట్ రౌడీ.
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా రాధా – భానుప్రియ హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమా 1989లో విడుదలై అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది . అప్పటివరకు వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవికి ఈ సినిమా బ్రేక్ వేసింది అని అంతా అనుకున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకునింది . బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా వెరైటీగా ఉండడంతో ఈ సినిమాను చూడడానికి జనాలు బాగా లైక్ చేశారు .
మరి ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం అందించిన బ్ప్పి లహరి .. చిరంజీవి నటనకు డ్యాన్సులకు ఫిదా అయిపోయాడు . కాగా 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా అంటే చిరంజీవికి మహా ఇష్టమట . ఎందుకంటే మొదటగా ఈ సినిమాని చాలామంది నెగటివ్ అంటూ సినిమా బాగాలేదు అంటూ ఏడిపించారట. ఆ తర్వాత తర్వాత సినిమా చూసి జనాలకు నచ్చి అదే సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకునింది . అప్పట్లోనే నైజాం ఏరియాలో ఈ సినిమా కోటి రూపాయలను సొంతం చేసుకుందంటే మెగాస్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు..!!