సినిమా ఇండస్ట్రీలో తలుక్కున్న మెరిసి ఆ తర్వాత ఫెడౌట్ అయిపోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఈ రచన బెనర్జీ . సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే రెండు దశాబ్దాలు – మూడు దశాబ్దాలు ఏలేస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో తక్కువ కాలం నటించినా ప్రజల మనసుల్లో చిరస్దాయి ని సంపాదించుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే ఈ రచన బెనర్జీ అని చెప్పుకోవచ్చు . చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన ఈ బ్యూటీ.. అంతకుముందుపలు సినిమాల్లో నటించిన..ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది .
మరీ ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్స్ లో తన క్యూట్ క్యూట్ స్మైల్ తోనే హ్యూజ్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది . రాముడు – కన్యాదానం – నేను ప్రేమిస్తున్నాను – మామిడాకులు – బావగారు బాగున్నారా – అభిషేకం – పిల్ల నచ్చింది – లాహిరి లాహిరి లాహిరిలో వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తెలుగు వారికి చాలా దగ్గరైన ఈ బెంగాల్ పాప ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చి సెటిల్ అయ్యిందో.. అంతే ఫాస్ట్ గా ఫెడవుట్ అయిపోయింది.
సినిమాల్లోకి రాకముందు మిస్ కోల్కత్తా.. అనే టైటిల్ కైవసం చేసుకున్న ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్ కి అందని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది . ఒకే హీరోతో ఏకంగా 40 కి పైగా సినిమాలో నటించి సినీ చరిత్రను తిరగరాసింది . ఒరియాలో మొత్తం 50 సినిమాలు చేయగా అక్కడ 40 కి పైగా చిత్రాలల్లో ఒకే హీరోతో కలిసి చేయడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి . ఆ హీరో ఎవరో కాదు సిద్ధాంత మహాపాత్ర . ఎదురులేని హీరోగా ఒరియా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తో రచన ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది ఆ తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకుంది . అయితే ఆ తరువాత విడాకులు కూదా తీసుకుంది. ఇలా ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్ అందుకోని అరుదైన ఘనతను అందుకుంది రచన..!!