Moviesతాను చేయాల్సిన "మగధీర" సినిమా ఛాన్స్..చరణ్ చేసి హిట్ కొడితే నవ్వుకున్న...

తాను చేయాల్సిన “మగధీర” సినిమా ఛాన్స్..చరణ్ చేసి హిట్ కొడితే నవ్వుకున్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు అయితే జనరల్ గా ఎవరైనా సరే మనం చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు కొడితే కచ్చితంగా బాధపడతారు . అది ఎలాంటి హీరో అయినా సరే కానీ ఈ హీరో మాత్రం ఇక్కడ తాను చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోతే హ్యాపీగా ఫీలయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ . ఎస్ ప్రభాస్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాడు ఎన్నో సినిమాల్లో చేసే ఛాన్స్ కూడా మిస్ అయిపోయారు. అయితే ప్రభాస్ అలా మిస్సయిన సినిమాలలో మగధీర కూడా ఒకటి . దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాంచరణ్ కెరియర్ ని మలుపు తిప్పింది ఈ సినిమానే అని చెప్పాలి . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమానే కారణం సూపర్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది.

కాగా అల్లు అరవింద్ అప్పటివరకు మార్కెట్ లేని రాంచరణ్ నమ్మి హ్యుజ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అప్పట్లోనే 80 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా అంటే ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు . అయితే ఈ కథను రాసుకున్నప్పుడు రాజమౌళి మొదటిగా అనుకున్న హీరో ప్రభాస్ అంటూ తెలుస్తుంది . ప్రభాస్ కటౌట్ కి ఈ కథ చాలా బాగుంటుంది అంటూ ఆశపడ్డారట . అయితే అప్పటికే వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట .

అయితే తాను రిజెక్ట్ చేసిన సినిమా రామ్ చరణ్ చేసి హిట్ కొట్టడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారట ప్రభాస్ . అలాంటి ఓ మంచి మనస్తత్వం మన డార్లింగ్ ప్రభాస్ ది. ప్రజెంట్ వేరు వేరు సినిమా షూట్స్ లో బిజీ గా ఉన్న చరణ్-ప్రభాస్.. త్వరలోనే కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నాం అంటూ ఓపెన్ గా చెప్పేసాడు ప్రభాస్. అది కూడా రాజమౌళి డైరెక్షన్ ఐయ్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news