సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోదామని వచ్చి అది కుదరక బుల్లితెరపై సెటిల్ అయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ . సినిమా ఇండస్ట్రీలో తన పేరు మారుమ్రో పోవాలని ఇంట్లో ఇష్టం లేకపోయినా సినిమా తెరపై మెరవడానికి నానా కష్టాలు పడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీకి పెద్దగా అవకాశాలు రాలేదు . ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి యాంకర్ గా చేయడానికి ఒప్పుకునేందుకు రష్మి. అయితే సినిమా ఇండస్ట్రీలో కన్నా బుల్లితెర పైన ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొని టాప్ యాంకర్లలో ఒకరుగా దూసుకుపోతున్న రష్మీ జబర్దస్త్లోకి యాంకర్ గారు రావడానికి ఓ అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అందరి దగ్గర అగ్రిమెంట్లపై సైన్ చేయించుకుంటారు అన్న విషయం తెలిసిందే . అయితే యాంకర్స్ కి మాత్రం వేరే విధంగా అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేసి సైన్ చేయించుకుంటారు అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. యాంకర్ రష్మీ జబర్దస్త్ లోకి వచ్చేముందు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కొన్ని కండిషన్స్ పెట్టారట . అంతేకాదు ఆమెకి నచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు షో నుంచి తప్పుకోవడానికి లేదు .. షో నుంచి తప్పుకోవాలంటే కచ్చితంగా రెండు మూడు నెలల ముందే ఇంటిమేట్ చేయాలి.
అంతేకాదు ఆ రెండు మూడు నెలలు కూడా ఆమెకి రెమ్యూనరేషన్ ఇవ్వరు . అంతేకాకుండా ఎమర్జెన్సీ కండిషన్స్ పైన ఎప్పుడైనా వెళ్లాలి అంటే ఆమె వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుని వెళ్ళాలి.. అంతేకాదు మరీ ముఖ్యంగా షోలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి..? ఎలా మాట్లాడాలి ..? ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలి అనేది పూర్తిగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ చూసుకుంటుందట .అలా అయితేనే షోలోకి హోస్టుగా తీసుకుంటారట . లేకపోతే వాళ్లు ఆ రోల్ కి నో చెప్పేస్తారట. కేవలం రష్మినే కాదు అనసూయ ..ప్రజెంట్ యాంకర్ గా ఉన్న సౌమ్య రావు కూడా అలాంటి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసే జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!