Moviesఛీ ఛీ.. రాత్రుల్లు హీరో రానా-రామ్ చరణ్ అలాంటి పనులు చేసేవారా..?

ఛీ ఛీ.. రాత్రుల్లు హీరో రానా-రామ్ చరణ్ అలాంటి పనులు చేసేవారా..?

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – రానా దగ్గుబాటి . ఇద్దరు కలిసి చదువుకున్నారు . చాలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రెసెంట్ ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా తమ సత్తాని చాటుతూ వచ్చారు. అయితే గతంలో ఓ స్టేజిపై వీళ్లిద్దరు చేసిన పనులను చిరంజీవి ఓపెన్ గా చెప్పుకొచ్చారు . దీంతో స్టేజిపై ఉన్న రానా – చరణ్ షాక్ అయిపోయారు.

అదేంటంటే రామ్ చరణ్ – రానా కలిసి చదువుకోవడానికి రామ్ చరణ్ ఇంటికి వెళ్లేవారట . కంబైన్ స్టడీస్ అంటూ చెప్పి మంచిగా ఫుడ్ – స్నాక్స్ రూమ్ లోకి తెప్పించుకొని డోర్స్ వేసుకునే వారట .ఫుల్ గా ఫుడ్ తినేసి.. పడుకోని.. కొద్దిసేపు చదువుకొని.. ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవ్వడానికి బయటకు వెళ్లేవారట . అయితే మెయిన్ గేట్ నుంచి వెళ్తే ఎక్కడ ఇంట్లోని వాళ్ళు అరుస్తారో అన్న భయంతో కిటికీ గ్రిల్స్ ని తీసి కిటికీ లో నుంచి బయటికి వెళ్లేవారట .

అయితే “ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలియదనుకున్నారు వీళ్లిద్దరూ.. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు ఇవన్నీ చిన్న చిన్న సరదాలుగా భావించి నేను సైలెంట్ గా ఉండిపోయాను..ఈ ఇద్దరూ అంత దొంగ ఫెలోస్ ” అంటూ స్టేజిపైనే చెప్పుకొచ్చాడు చిరంజీవి . దీంతో చరణ్ – రానా షాక్ అయిపోయారు. పకపకా నవ్వుతూ ఈ విషయం మీకు ఎలా తెలుసు..? అంటూ స్టాన్ అయిపోయారు. ఏది ఏమైనా సరే రామ్ చరణ్ – రానా కూడా కుర్ర వయసులో చేయాల్సిన అల్లరి పనులన్నీ చేసేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news