తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నెంబర్ 1 హీరోలుగా అశేష ప్రజాభిమానం పొందిన స్టార్లు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు ఒకరైతే.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాలకు పైగా ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో కొనసాగారు. ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి శకం ఇండీస్ట్రీ లో మొదలైంది. అప్పటి వరకు కేవలం ఒకే మూసలో సాగుతున్న తెలుగు సినిమా గతిని మార్చిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.
తన డ్యాన్స్ లతో.. ఫైట్స్ లతో చిరంజీవి ఆరోజుల్లో ఒక ప్రభంజనం క్రియేట్ చేశారు. ముఖ్యంగా నటనలో కూడా తనకి తానే సాటి.. తనకు ఎవ్వరు లేరు పోటీ అనేలా చిరంజీవి కెరీర్ సాగింది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చాలా ఒడిదుడుకులనే ఎదురుకున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా నెమ్మదిగా హీరో రోల్స్ సంపాదించుకున్న చిరంజీవి.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి కూడా ఒక సినిమాలో నటించాడు.
ఆ సినిమా పేరే ‘ఎదురులేని మనిషి’..ఇందులో ఎన్టీఆర్ చెల్లికి భర్తగా, నెగిటివ్ రోల్ లో చిరంజీవి నటించడం గమనార్హం. సినిమా చివరిదాకా చిరంజీవి నెగిటివ్ రోల్ పోషించారు. చివర్లలో బావ వెంట నిలిచి రౌడీ మూకల ఆటను కట్టిస్తారు. కథనం సరిగా ఎగ్జిగ్యూట్ కాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కే దేవీ వరప్రసాద్ నిర్మాతగా, కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఈ సినిమాను ఆ రోజుల్లోనే రెండు కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా..నాలుగు కోట్లకు పైగా ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా విడుదలై తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఫుల్ రన్‌లో మాత్రం చతికిల పడింది. ఈ సినిమా రెండు కోట్ల కలెక్షన్లు రాబట్టి.. రెండు కోట్ల రూపాయల భారీ నష్టంతో బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చి ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.