ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు హ్యూజ్ రేంజ్ లో హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డులు తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తుంది బేబీ సినిమా . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది .
లవ్-రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాగా జనాలకు తెగ నచ్చేసింది . మరీ ముఖ్యంగా నేటి యువతకు బాగా నచ్చేసింది . ఈ క్రమంలోనే సినిమాని హ్యూజ్ హిట్ చేశారు . కాగా పెట్టిన దానికి నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చి ఏకంగా 50 కోట్లు క్రాస్ అయ్యింది ఈ సినిమా. కాగా ఇదే క్రమంలో ఈ సినిమాల్లో నటించిన నటీనటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా ఈ సినిమాలో హీరో పాత్రులో నటించిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం 70 లక్షలు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు హీరోయిన్ వైష్ణవి చైతన్య 30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా వీరాజ్ ఈ పాత్ర కోసం 25 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో కోట్లు కలెక్షన్లో కొల్లగొట్టిన వీళ్ళ రెమ్యూనరేషన్ ఇంత తక్కువగా ఉన్నాయంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!