Moviesసినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర..పాన్ ఇండియా హీరో ప్రభాస్ రికార్డులను బద్ధలు...

సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర..పాన్ ఇండియా హీరో ప్రభాస్ రికార్డులను బద్ధలు కొట్టిన “బేబీ..!!

ఇది నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తుక్కుతుక్కు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది .

ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని వసూళ్లను రాబడుతూ ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పటికే ఈ సినిమా 40 కోట్లు దాటేసింది. కాగా రీసెంట్గా ఈ సినిమా మరొక క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది . పాన్ ఇండియా హీరో ప్రభాస్ రికార్డులను ఈ సినిమా బద్ధలు కొట్టింది. ప్రభాస్ రీసెంట్ గా నటించిన సినిమా “ఆది పురుష్”.

“ఆది పురుష్” సినిమా 5వ రోజు దాదాపుగా రెండు కోట్ల 43 లక్షల రూపాయలను షేర్ వసూలు రాబట్టాయి. కానీ బేబీ చిత్రం 5వ రోజు రెండు కోట్ల 90 లక్షలు రాబట్టి ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేసింది . దీనితో ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . ఓ పాన్ ఇండియా హీరో రికార్డులను ఆనంద్ దేవరకొండ బద్దలు కొట్టడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాకి కర్త – కర్మ- క్రియ అంతా వైష్ణవి చైతన్యానే అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news