గత కొన్ని రోజులుగా మెగా హీరో నాగబాబు కూమారై నిహారిక విడాకులపై జరుగుతున్న వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయి. మెగాడాటర్ నిహారిక .. తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో ఉన్న బంధాన్ని అధికారికంగా తెంచేసుకుంది. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీని భారీగా కుదిపేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ విడాకులే కాదు.. మెగా ఫ్యామిలీలో ఒకేసారి మూడు విడాకుల వార్త పెద్ద కలకలం రేపుతోంది. ఈ జంటలు ఏవేవో కాదు చైతు – నిహారిక, చిరు రెండో కుమార్తె శ్రీజ – కళ్యాణ్‌దేవ్‌తో పాటు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో కూడా విడిపోతున్నట్టుగా తెలుస్తోంది
ఇక యేడాది కాలం నుంచి విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తోన్న వార్తలను నిజం చేశారు నిహారిక – చైతన్య. వీరిద్దరు కూటట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు దరఖాస్తు చేశారు. ఇక వీరు మాజీ భార్య, భర్తలు కానున్నారు. నిహారిక 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్నారు. చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ కూడా తన రెండో భర్త కళ్యాణ్‌దేవ్‌తో దాదాపు యేడాదిన్నర కాలంగా దూరంగా ఉంటోంది. ఆమెకు ముందే ఓ పెళ్లయ్యి ఓ పాప పుట్టాక విడాకులు తీసుకుంది. తర్వాత కళ్యాణ్‌దేవ్‌ను పెళ్లాడి మరో పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు వీరి మధ్య కూడా మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారట.
ఇక మెగా ఫ్యామిలీలోనే మరో విడాకుల వార్త కూడా మెగాభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఆ మూడో విడాకులు ఎవరివో కాదు పవన్ కళ్యాణ్‌వి. పవన్ తన మూడో భార్య కూడా దూరంగా ఉంటోంది. వీరిద్దరు గత రెండేళ్లుగా కలిసి ఉండడం లేదంటున్నారు. ఆమె రష్యాలో ఉందని.. సింగపూర్‌లో ఉందంటున్నారే తప్పా పవన్ దగ్గర మాత్రం ఉండడం లేదు. అయితే వీరి విడాకుల తంతు ఎన్నికల తర్వాత ఉంటుందని టాక్ ? ఏదేమైనా మెగా ఫ్యామిలీలో వరుస విడాకులు వారి బంధాలను ప్రశ్నిస్తున్నాయి.