ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ పేరుని జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. మరి ముఖ్యంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై ఆమె పరోక్షంగా ట్విట్స్ చేస్తున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా అనసూయ పేరుని ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ చేసిన పాజిటివ్ ట్వీట్ తో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటున్నా టైంలో మరోసారి అనసూయ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ షేర్ చేసింది .
దీనితో మళ్లీ కధ మొదటికొచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. కాగ రీసెంట్ గా అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోస్ లో అనసూయ టూ హాట్ గా ఉండడంతో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ .. తన హేటర్స్ మీద అసహనం వ్యక్తం చేస్తూ అనసూయ ట్వీట్ చేసింది.
“వావ్ నేను వాళ్లకు ఇంత ముఖ్యమా ..? అసలు నా ప్రమేయం ఉన్నా లేకపోయినా .. నాకు సంబంధం లేని మ్యాటర్లో కూడా నన్ను లాగుతున్నారు .. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగకుండానే నాపై నా పేరు అక్కడ ప్రస్తావించడం చాలా విచిత్రంగా ఉంది . నాపై ఇంత డిపెండ్ అయి ఉన్నారా ..? వీళ్ళు నా పేరు లేకుండా పాపం ఏది చెప్పలేకపోతున్నారు “అంటూ అసహనంగా ట్వీట్ చేసింది . దీనితో అసలు అనసూయని ఎవరు ఏమన్నారు..? ఆమె పేరు ఎవరు ప్రస్తావన తీసుకొచ్చారు ..? అంటూ నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు అసలు ఏమైందో చెప్పకుండా ఏం చేయాలి చెప్పు..? అనసూయ అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.