టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నినిఛితార్ధం చేసుకున్న విషయం మనకు తెలిసిందే . జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా లావణ్య త్రిపాఠి వేలుకి ఉంగరాన్ని తొడిగి తన భార్యను చేసుకున్నాడు మెగా వరుణ్ తేజ్ . అప్పటినుంచి ఫారిన్ టూర్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ తన కాబోయే భార్య లావణ్య త్రిపాఠి తో కలిసి తిరిగిన ఫొటోస్ ను షేర్ చేసుకుంటూ అభిమానులకి కొత్త అప్డేట్స్ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే రీసెంట్గా వీళ్ళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అల్లు అరవింద్ “చావు కబురు చల్లగా” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ..” లావణ్య త్రిపాథికి ఓ సజెషన్ ఇస్తారు. ఎక్కడి నుంచో వచ్చి తెలుగు బాగా మాట్లాడుతున్నావ్. ఇక్కడ ఎవరినైనా చూసి పెళ్లి చేసుకొని సెటిలైపోవచ్చుగా ” అంటూ సజెషన్ ఇస్తారు . అయితే నిజంగానే తన ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది లావణ్య త్రిపాఠి .
ఇదే విషయాన్ని రీసెంట్గా అల్లు అరవింద్ ” బేబీ” ఈవెంట్ కి వచ్చినప్పుడు యాంకర్ ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..” నేను ఏదో సరదాగా చెప్పాను .. ఆ అమ్మాయి సీరియస్గా తీసుకునింది ” అంటూ ఫన్నీగా కౌంటర్ వేశారు . అంతేకాదు వైష్ణవి చైతన్య ను మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవద్దంటూ సజిస్ట్ చేశారు.. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది “అంటూ స్టేజి పైనే ఆమె పెద్ద హీరోయిన్ అవుతుంది అంటూ పొగిడేసారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..!!