Moviesమెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటీ..? అభిమానులకు...

మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటీ..? అభిమానులకు కొత్త డౌట్లు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో..వెబ్ మీడియాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ పేర్లు ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు ఏం ముహూర్తం న నిశ్చితార్ధం చేసుకున్నారో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ..కనిపిస్తున్నాయి . జూన్ 9న లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ నాగబాబు నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్ధపు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ క్రమంలోని సైలెంట్ గా ఉండే లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కాబోతుందా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అసలు లావణ్య త్రిపాఠి ఎలా వరుణ్ ని పడేసింది ..? అసలు ఆమె క్యాస్ట్ ఏంటి ..? ఆమె కుటుంబ వివరాలు ఏంటి..? అంటూ తెగ వెతికేస్తున్నారు మెగా అభిమానులు . ఈ క్రమంలోనే ఎక్కువ మంది మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి ఏ క్యాస్ట్ కి చెందిన అమ్మాయి అంటూ సెర్చ్ చేశారు అన్న ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి ఇది వాళ్ళ పర్సనల్ విషయం కానీ మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి ఏ క్యాస్ట్ కి చెందిన అమ్మాయి అంటూ గుచ్చి గుచ్చి చర్చిస్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి యూపి కి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పెరిగింది అంత డెహ్రాడూన్ లోనే .. అంతే కాదు చదువు కూడా అక్కడే ఫినిష్ చేసింది. తండ్రి హైకోర్టు న్యాయవాది ..తల్లి రిటైర్డ్ టీచర్ కావడంతో మొదటి నుంచి క్రమశిక్షణగా పెరిగింది లావణ్య త్రిపాఠి . అంతేకాదు ఆమెకు ఓ చెల్లి – తమ్ముడు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ అంటే ఇష్టం ఉన్న లావణ్య త్రిపాఠి .. అటువైపుగా అడుగులు వేస్తూ హీరోయిన్గా మారిపోయింది . ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ఓ సినిమాలో నటించి ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడిపోయింది . వరుణ్ కి కూడా అలాగే అనిపించడంతో ఇద్దరు మనసులు కలిసాయి . అలా అలా గుట్టు చప్పుడు కాకుండా నడిపిన వీళ్ళ ప్రేమాయణం ఇప్పుడు భార్యాభర్తల బంధం గా మారిపోతుంది .

అయితే సోషల్ మీడియాలో గుచ్చి గుచ్చి లావణ్య త్రిపాఠి క్యాస్ట్ గురించి మెగా అభిమానులు చర్చిస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీంతో కొందరు జనాలు ..మన తెలుగు వాళ్లకు ఈ క్యాస్ట్ ఫీలింగ్, పట్టింపు, ఒకరి కులం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఈ స్థాయిలో ఉందో ఈ పరిణామం తెలియజేస్తుంది. దీంతో మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి క్యాస్ట్ విషయం వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news