Moviesమెగా వారసురాలు పేరు ఇదే.. పాప ఎవరి పోలికో చెప్పేసిన రామ్...

మెగా వారసురాలు పేరు ఇదే.. పాప ఎవరి పోలికో చెప్పేసిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ హర్ట్..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ఆయన భార్య ఉపాసన జూన్ 20 తేదిన 1: 49 నిమిషాలకు పండులాంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ వినిపించింది . మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ కి బిడ్డ పుడితే చూడాలి అనేది చిరంజీవి కోరిక ఆ విషయాన్ని అఫీషియల్ గానే ప్రకటించాడు.

కాగా ఎట్టకేలకు చిరంజీవి చిరకాల కోరిక తీరిపోవడంతో చిరంజీవి సైతం ఫుల్ ఖుషి ఖుషి గా ఉన్నారు. కాగ కొద్దిసేపటి క్రితమే ఉపాసన ప్రిన్సెస్ ని తీసుకొని తన మామ గారి ఇంటికి కారులో బయలుదేరింది . దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా పాపను ఉపాసన డిశ్చార్జ్ చేసిన తర్వాత చరణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు . ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

” మొదటిగా మా కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ..మా పాప ఉపాసన చాలా బాగున్నారు. హెల్తీగా ఉన్నారు. మీ ప్రార్థనలో ఫలించాయి అందరూ ఆశీర్వదించకు చాలా చాలా థాంక్స్ ..త్వరలోనే పాపకు నామకరణం కూడా చేస్తాము ..నేను ఉపాసన ఆల్రెడీ ఒక పేరుని అనుకున్నాం ..నాకు సాంప్రదాయాలు పెద్దగా తెలియదు 13వ రోజు లేదంటే 21వ రోజు ఆ పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం.. ఉపాసన కోసం నా బిడ్డ కోసం బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్” అంటూ చెప్పుకోచ్చారు.

ఇదే క్రమంలో పాప ఎవరు పోలిక అనగానే మా నాన్న చిరంజీవి గారి పోలిక అంటూ నవ్వుతూ చెప్పారు .దీంతో ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి ఖుషీగా ఉన్నారు. తాత పోలిక వచ్చిన మనవరాలు ఇండస్ట్రీని ఎలేస్తుంది అని మెగా ఫ్యామిలీలో టాప్ మోస్ట్ స్థానానికి వెళ్లబోతుంది అంటూ ఇప్పటికే వేణు స్వామి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా పాపకి సుశ్రీ శోభ, అంజలి ఇలా రెండు పేర్లు అనుకున్నారట కుటుంబ సభ్యులు. అయితే పాప ఫేస్ ఎక్కడ రివీల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఉపాసన చరణ్ ల పాప పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news