చాలామంది సెలబ్రిటీలు లేటు వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ప్రేమలో పడుతున్నారు.. డేటింగులు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కొందరు సెలబ్రిటీలు 50 – 60 సంవత్సరాలు దాటాక కూడా పెళ్లి చేసుకుని పిల్లలనుకుంటున్నారు. సీనియర్ నటుడు వీ.కె నరేష్ రీసెంట్‌గా తాను సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ తో పిల్లలను కనేందుకు చాలా ఫీట్ గా ఉన్నానని కామెంట్ చేశాడు. అయితే నరేష్ కంటే ముందే కొంతమంది తారలు లేటు వయసులోనూ పిల్లలకు జన్మనిచ్చారు.
టాలీవుడ్ హీరో కృష్ణంరాజుకు మొదట ఒక కుమార్తె పుట్టింది. తర్వాత కుమారుడి కోసం ఎదురు చూశారు. అయితే మళ్లీ కూతురే జన్మించింది. చివరకు 56 ఏళ్ల వయసులో కూడా కృష్ణంరాజు మరో కుమార్తెకు జన్మనిచ్చారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు విడాకులు ఇచ్చి లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు.
దాంతో 50 ఏళ్లు పైబడిన తర్వాత అమీర్ లేటు వయసులో పిల్లలను కన్నాడు. అమీర్ రెండో భార్య ద్వారా ఒక కుమారుడిని కన్నాడు. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ సీనియర్ హీరోయిన్ రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2001లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా 2004లో వీరికి రాహుల్ అనే బాబు జన్మించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ తీసుకున్న తర్వాత 46 ఏళ్ల వయసులో తన మూడో భార్య అన్నా లెజ్నోవాను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు.
ఇక ప్రకాష్ రాజు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు లేటు వయసులో జన్మనిచ్చారు. నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో తేజస్విని అనే మహిళను 50 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.