Moviesఅన్న పని పూర్తి అయ్యింది.. ఇప్పుడు తమ్ముడి వంతు.. మెగా హీరోలు...

అన్న పని పూర్తి అయ్యింది.. ఇప్పుడు తమ్ముడి వంతు.. మెగా హీరోలు అని ప్రూవ్ చేసారుగా..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోస్ కి ఎలాంటి క్రేజీ స్థానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే మెగా హీరోలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి . ఆ తర్వాత అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . వీళ్ళిద్దరి తర్వాతే ఏ మెగా హీరో అయిన జనాలు మదిలో మెదులుతూ ఉంటారు . అయితే ప్రెసెంట్ ఇద్దరు తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ మెగా హీరోలు ఒకే హీరోయిన్ పై మోజు పడడం ఆ హీరోయిన్ ని తమ సినిమాలో పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

మనకు తెలిసిందే చిరంజీవి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది. హ్యూజ్ సక్సెస్ అయింది . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి . మరి ముఖ్యంగా బాస్ పార్టీ సాంగ్ సినిమాకి హైలైట్ గా మారింది . ఈ పాటలో ఆడి పాడి అలరించి చిందులేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీరౌతేలా.

ఈ పాటకి అమ్మడు డాన్స్ .. అందాలు ఎంత హైలైట్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ బ్యూటీపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కన్నేసినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ కాంబోలో రాబోతున్న “బ్రో” సినిమాలో అమ్మడు హాట్ ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో చిందులేయడానికి సిద్ధమయింది ఊర్వశి రౌతేలా.

ఈ ఐటెం సాంగ్ కోసం హైదరాబాద్లో ఓ పబ్ సెట్ ని ఏర్పాటు చేశారట . ఈ సెట్లో ఐటం నెంబర్ షూట్ చేయనున్నారట . ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పాటలో పవన్ కళ్యాణ్తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా లుంగి కట్టుకుని చిందులేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. దీంతో అన్న బ్యూటీని తమ్ముడు వాడుకుంటున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news