మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా లేటెస్ట్ గా నటించిన వెబ్ సిరీస్ “జి కర్దా”.. ఈ సిరీస్ లో తమన్న ఎంత హాట్ గా నటించిందో మనకు తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేశాయి . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా నటించిన .. ఈ బ్యూటీ ఈ సిరీస్ కోసం హద్దుల మీరి టాప్ తీసేసి బోల్డ్ రొమాన్స్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
ఈ వెబ్ సిరీస్ హాట్ హాట్గా స్ట్రీమింగ్ అవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇలా బోల్డ్ గా నటించిన తమన్నా పై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా రియాక్ట్ అయింది. తమన్నా మాట్లాడుతూ..” అందరూ ఈ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అది బోల్డ్ కంటెంట్ కాదు నిజమైన వాస్తవం . సమాజంలో ఇప్పటికీ అరాకొరా ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరి నేను ఎందుకు ఇలాంటి పాత్ర చేశానని మీరు అనుకోవచ్చు ..నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలి ..కథకు ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా అవసరం అనిపించాయి.”
“ఒక రిలేషన్షిప్ ని వాస్తవంగా చూపించడానికి ఇవే కీలకం . అందుకే ఇలా బోల్డ్ గా నటించాల్సి వచ్చింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని తిట్టినా అది జనాలకు నచ్చిన నచ్చకపోయినా కథ అనేది వాస్తవం.. కథలో భాగంగా వాటిని అలాగే చూపిస్తారు.. ఇక నేను ఇంత కంఫర్టబుల్గా ఇంత ఫ్రీగా ఇలా చేయడానికి కారణం డైరెక్టర్ ..ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు మేరకే నేను ఇలా నటించగలిగాను “అంటూ చాలా బోల్డ్ గా స్పందించింది. త్వరలోనే స్ట్రీమైంగ్ అయ్యే లస్ట్ స్టోరీస్ లో తమన్నా విజయవర్మతో రొమాన్స్ చేసినట్లు ఇప్పటికే కొన్ని పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . దీంతోనే ఈ రేంజ్ లో ఉంటే లస్ట్ స్టోరీస్ 2 లో ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!