సినిమా ఇండస్ట్రీలో బోలెడు ఉంది హీరోలు ఉన్నారు . బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోయిన్ ని హీరోస్ ని ఇష్టపడుతూ ఉంటారు. తాము నమ్మిన ఇష్టపడిన హీరోయిన్స్ ని హీరోస్ ని టాప్ పొజిషన్స్ లో ఊహించుకుంటూ.. వాళ్ళ పేరుని ట్రెండ్ చేస్తూ ఉంటారు . అయితే చాలా కొద్ది మంది హీరోయిన్లకి మాత్రమే అభిమానుల నుంచి వార్మ్ హార్ట్ ఫెల్ట్ లవ్ లభిస్తుంది . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది తమన్నా .
మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. ఎప్పుడు అభిమానులు పట్ల ప్రేమగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది . అరవడం.. ఫోటోల కోసం వస్తే సెక్యూరిటీతో నెట్టేయించడం ఇలాంటివి ఏది చేయదు. ప్రేమగా దగ్గరికి తీసుకుని ..హగ్ చేసుకుని ..వాళ్ళకి సెల్ఫీ ఇస్తూ ఉంటుంది . అందుకే తమన్నా అంటే అభిమానులు అలా పడి చచ్చిపోతూ ఉంటారు . రీసెంట్ గా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న క్రమంలో తమన్న తన ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగింది .
ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆమెకు ఫ్లవర్ బొకే ఇచ్చి.. కాళ్ళకి నమస్కారం చేస్తూ ..తన చేతిపై ఉన్న తమన్న టాటూ ను చూపించారు . దీంతో ఎమోషనల్ గా ఫీల్ అయిన తమన్నా అక్కడక్కడే ఏడ్చేసింది . ఎంతలా అంటే కార్ ఎక్కే ముందు కూడా ఏడుస్తూనే బాయ్ చెబుతూ ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో తమన్న పేరు మరోసారి వైరల్ గా మారింది .అంతేకాదు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా తమన్నా ఒక్కటే ఇలా ఫ్యాన్స్ పట్ల ప్రేమ ఆప్యాయత చూపిస్తుంది అంటూ తమన్న ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో తమన్నా టాటూ వీడియో వైరల్ గా మారింది..!!