సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి రామానాయుడు గారికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దగ్గుబాటి ఫ్యామిలీకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కారణం డి రామానాయుడు గారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్ లో సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా రాజ్యమేలేసిన డి రామానాయుడు గారు ఎన్టీఆర్ – ఏఎన్నార్ లాంటి వాళ్ళతో సినిమాలు తీసి హిట్లు కొట్టి హ్యూజ్ ప్రాఫిట్స్ అందుకున్నారు .
అంతేకాదు కొన్నిసార్లు ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా లాస్ అయిన సందర్భాలు ఉన్నాయి . అయితే డబ్బులు వచ్చిన డబ్బులు పోయిన ఒకే విధంగా ఉండే దగ్గుబాటి రామానాయుడు గారు . అయితే ఆ విషయంలో సురేష్ బాబు టోటల్ డిఫరెంట్ . కాంట్రవర్షియల్ కంటెంట్ జోలికి వెళ్ళకుండా సేవ్ జోన్ లో ఉండే సినిమాలను తీస్తూ రిస్క్ లేకుండా పని పూర్తి చేసేసుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అహింస సినిమా అట్టర్ ఫ్లాప్ గా మారిపోయింది . తేజ డైరెక్షన్లో వచ్చిన అహింస సినిమా అట్టర్ ఫ్లాప్ గా మారింది. ఈ క్రమంలోని పెట్టిన దానికి 10 రూపాయలు కూడా రాకుండా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారట . ఈ క్రమంలోనే సురేష్ బాబు కొన్నాళ్లపాటు దగ్గుబాటి అభిరామ్ ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఆయన కూడా సినిమాల నిర్మాణంలో కూసింత అడుగులు వెనక్కి వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా సినిమాలు స్టార్ట్ చేస్తామన్న ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అభిరామ్ ..శ్రీరెడ్డితో నడిపిన యవ్వారాల గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే దగ్గుబాటి ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అటు హిట్లు లేక.. ఇలా సినిమాలు నిర్మించక దగ్గుబాటి ఫ్యామిలీ ఏమైపోతారో అంటూ బాధపడిపోతున్నారు..!!