టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్ధ్.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాడు . మరీ ముఖ్యంగా ఆయనతో సినిమాలో నటించే హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడుపుతూ..వాడుకుని వదిలేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది .
అయితే ఇలాంటి క్రమంలోనే మళ్లీ తెలుగులో ఆక్టివ్ అవ్వడానికి సిద్ధార్ధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓ సినిమాలో నటించాడు . ఆ సినిమా పేరు టక్కర్. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా .. సిద్ధార్థ్ కి జోడీగా దివ్వాన్ష కౌశిక్ నటించారు. అవుట్ అండ్ అవుట్ లవ్ -యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో సిద్దు కంప్లీట్ డిఫరెంట్ అవతారం లో కనిపించాదూ. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన టక్కర్ చిత్రాన్ని తెలుగులో టీవీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన టక్కర్ సినిమాకు నివాస్ కే ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యోగిబాబు కీలక కీలకపాత్రలో కనిపించడం సినిమాకి హైలెట్ గా నిలిచింది.
టక్కర్ కధ ఏమిటంటే.. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనే ఓ పేద యువకుడి పాత్రలో సిద్దార్ధ్ నటించి మెప్పించారు. ఎలాగైన డబ్బు సంపాదించి.. ధనవంతుడు కావాలన్న ఆశతో ఆ యువకుడు తప్పుడు దారులల్లో వెళ్ళి.. వాటి వల్ల పర్వవసానాలు ఏంటీ..> ఎలాంటి చిక్కులు ఇర్రుకున్నాడు..ఎదురుకున్నాడు.. మధ్య లో వచ్చిన ప్రేమ ని గెలుచుకున్నాడా లేద్దా..? అనేది కథ. సినిమాలో మాఫీయా, యాక్షన్ తో పాటు సిద్దార్ధ్ రొమాన్స్ డోస్ కూడా గట్టిగా ఇచ్చాడు.
అయితే సిద్ధార్థ్ రేంజ్ కధ కాదు ఇది అని అంటున్నారు జనాలు. సిద్ధు అంటే అందరికి ఇప్పటికీ బొమ్మరిల్లు క్యూట్ లుక్స్.. లేదంటే.. నువ్వోస్తానంటే నేనోద్దంటానా లో ఉన్నట్టుగా లేత కుర్రాడి ఆకారం ..అయితే ఈసినిమాలో సిద్దు లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అసలు ఆయన సిద్దునేనా అనేలా ఉన్నాడు. ఈసినిమా ఫస్ట్ హాప్ కొంత వరకూ చూడగలిగేలా ఉన్నా.. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ డిజాస్టర్. తలనొప్పులు రావడం పక్కా అంటున్నారు జనాలు. అసలు ఎందుకు రొమాంటిక్ సీన్స్ పెట్టారో అర్ధం కాలేదు. ఈసినిమాకు సిద్దు కరెక్ట్ చాయిస్ కాదు..అని జానలు చెప్పుకొస్తున్నారు. దీంతో టక్కర్ సినిమాతో ఏదో చించేస్తాం..పొడిచేస్తాం అనుకున్న ఈ హీరో మరోసారొ బొక్క బోర్లా పడ్డాడు..!!