టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి నందమూరి తారక రామారావు గారి తర్వాత నందమూరి ఫ్యామిలీని సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రజెంట్ భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యారు. కాగా ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . కాగా బాలయ్య కూతురు బ్రాహ్మిణిని ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట బాలకృష్ణ . అదే విషయాన్ని సదరు స్టార్ హీరో తండ్రి కూడా చెప్పుకొచ్చారట. ఇద్దరు కూడా ఓకే అనుకున్నారట . అయితే ఆ స్టార్ హీరో అప్పటికే వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడం ..ఆ ఫోటోలు నెట్టింట లీక్ అవ్వడం అవి కాస్త బాలయ్య కంటపడడంతో నారా బ్రాహ్మీణి కి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట .
అయితే అప్పటివరకు ఆ స్టార్ హీరో తండ్రికి తన కొడుకు ప్రేమలో ఉన్నాడు అన్న విషయం తెలియక బాలయ్యకు మాటిచ్చేసాడట. అయినా సరే బాలయ్య పెద్ద మనసుతో ఎవరిదైనా ఇష్టం లేకుండా పిల్లలకి పెళ్లి చేయకూడదు అంటూ ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసారట. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తో ఘనంగా వివాహం జరిపించారు. ప్రజెంట్ నారా బ్రాహ్మిణి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది . హెరిటేజ్ సంస్ధలను చూసుకుంటూ తన పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరుని సంపాదించపెడుతుంది..!!