ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. కాగా అలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ కి ఫామిలీ సీన్స్ కోసం పరితపించే సినీ జనాలకు ఇది అద్భుతమైన సినిమా అనే చెప్పాలి . మెయిన్ తెలుగు తమిళంలో బైలింగ్వల్‌గా తెరకెక్కిన విమానం సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్లో రిలీజ్ అయింది . శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ , రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ , మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించారు .
ఈ చిత్రం అభిమానులని ఆకట్టుకునేసింది. కాగా తండ్రి తన కొడుకు కోరికను తీర్చడానికి ఏ విధంగా కష్టపడతాడు .. కొడుకు ఆనందాన్ని తన ఆనందంగా భావించే ఓ తండ్రి తన స్థాయికి మించిన పనులను ఎలా చేసి కొడుకు కోరిక నెరవేర్చారు అనేది ఈ సినిమాలో బాగా క్లియర్ గా చూపించారు డైరెక్టర్. చిన్నప్పుడే తల్లి చనిపోయిన కొడుకుని గారాబంగా పెంచిన తండ్రి తన వారసత్వంగా వచ్చే టాయిలెట్స్ కాంప్లెక్స్ నడుపుతూ కొడుకుని చదివిస్తూ ఉంటాడు. అయితే కొడుకు కి విమానం అంటే చాలా పిచ్చి. ఎంతలా అంటే ఆకాశంలో విమానం ఎగిరిని ప్రతిసారి తనను తాను మర్చిపోతూ ఉంటాడు .
అది చూసేందుకు రోజు ఎయిర్ పోర్ట్ కి వెళ్తూ ఉంటాడు . ఒక్కసారి అయినా సరే నాన్న విమానం ఎక్కాలి అంటూ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అయితే ఓ రోజు తనకి ఆరోగ్యం బాగోలేదు అని బయటపడుతుంది . అతడికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్ ) అని తెలిసింది . దీంతో కొడుకు కోరికను తీర్చడానికి విమానం ఎక్కించాలని నిర్ణయించుకుంటాడు నాన్న.. అయితే డబ్బులు లేక అందుకోసం వీరయ్య ఏం చేస్తాడు ..? ఆయన ప్రయాణానికి ఎవరు అడ్డు తగిలారు..? ఎవరు హెల్ప్ చేశారు ..? వీరయ్య ఎలాంటి బాధలు పడ్డాడు..? అనేది క్లియర్‌గా చాలా ఎమోషనల్ గా చూపించాడు.
వేశ్య గా సుమతి పాత్ర చేసిన అనసూయ సినిమాకి హైలెట్ అని చెప్పాలి . అంతే కాదు ఆమె చెప్పే బోల్డ్ డైలాగ్ ” ప్రతి మగాడు మోకాలు పైన పట్టుకుంటాడు.. కానీ మోకాళ్ళ కింద పట్టుకుంటున్న మగాడివి నువ్వే”.. అని చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది.. అంతేకాదు ఇది స్వచ్ఛమైన తండ్రి కొడుకుల ప్రేమకు- అనురాగానికి -ఆప్యాయతకి సంబంధించిన సినిమా అని ఎమోషనల్ ఫీల్ గుడ్ హాట్ టచింగ్ స్టోరీ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎటువంటి బోల్డ్ సీన్స్ వల్గర్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో విమానం సినిమా పోజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..!!