Movies"ఇప్పటికే రెండు సార్లు చేసుకున్నాం..ఆ విషయంలో మాకు భయం లేదు"..రకుల్ బోల్డ్...

“ఇప్పటికే రెండు సార్లు చేసుకున్నాం..ఆ విషయంలో మాకు భయం లేదు”..రకుల్ బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది .హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలకు సైన్ చేసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేసింది.

రకుల్ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . అయితే బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నానితో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చిన రకుల్ పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోము అంటూ క్లారిటీ ఇచ్చింది . అయితే ఎప్పుడైతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమిస్తున్నాను అని చెప్పిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో వాళ్లకు సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి .

అంతేకాదు ఏకంగా ఈ జంట ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది అంటూ కూడా ప్రచారం జరిగింది . తాజాగా ఇదే కామెంట్స్ పై రకుల్ స్పందించింది . ఆమె మాట్లాడుతూ..” మా ప్రేమ విషయాన్ని దాచడానికి మేమేం ఇంకా చిన్న పిల్లలం కాదు . మాకేం భయం లేదు ..మేమేం తప్పు చేయడం లేదు. మేము ప్రేమించుకుంటున్నామని నిర్భయంగా బయటపెట్టాం. సోషల్ మీడియా మాకు ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసేసింది . ఇంకెన్ని సార్లు చేస్తుందో కూడా తెలియదు . ఇలా సోషల్ మీడియాలో మా గురించి రాసే బదులు నిజా నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది: అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . కాగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు2 సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news