టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు . అయితే అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సోషల్ మీడియాలో నిరంతరం టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంటారు రెబల్ హీరో ప్రభాస్ . ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే .. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న అన్ని సినిమాలు ఆ లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి .
ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌లను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అయితే తన ఇంటికి ఎవరు వచ్చినా సరే అన్నం పెట్టకుండా పంపించని ప్రభాస్.. అన్నం పెట్టి చంపేస్తాడు అన్న రేంజ్ లో మర్యాదలు చేస్తాడట . ఇదే విషయాన్ని ఎంతో మంది ప్రముఖులు కూడా చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా షూట్ అప్పుడు మొత్తం క్యారియర్ క్యారియర్లు సర్దేసి అందరికి కడుపునిండా భోజనం వడ్డించే ప్రభాస్ .. తన డైనింగ్ టేబుల్ పై ఈ ఐటెం కనిపిస్తే మాత్రం కంచం కూడా నాకేస్తాడట .
ఆ ఐటమే ఫ్రాన్స్ రొయ్యలు ఫ్రై . యస్ ఇది అంటే ప్రభాస్‌కు చచ్చిపోయేంత ఇష్టమట . ఎప్పుడు రొయ్యలు చేసిన సరే కేజీలు కేజీలు లేపేస్తాడట . అంతేనా చిన్నప్పుడైతే రొయ్యలులేనిదే అన్నం తినేవాడు కాదట . బాగా మొండి చేసి రొయ్యల ప్రై చేయించుకుని తినేవారట . అంతేకాదు ఇప్పటికే డైటింగ్ లో ఉన్న వన్డే చీట్ డే కింద నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేస్తాడట ప్రభాస్ . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!