Movies ఆ హీరోయిన్ తో లిప్ కిస్ అంత బాగుంటుందా..? నాగ చైతన్య...

 ఆ హీరోయిన్ తో లిప్ కిస్ అంత బాగుంటుందా..? నాగ చైతన్య ఓపెన్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాత నాగేశ్వరరావు తండ్రి నాగార్జున పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో జోష్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య 100% లవ్ తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అందుకోలేక పోయిన నాగచైతన్య మళ్లీ మజిలీ సినిమా ద్వారా హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు . కాగా నాగచైతన్య తన సినిమాల్లో బోలెడు మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . అయితే తన ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం సమంతనే  అంటూ చెప్పుకొచ్చారు . కస్టడి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇదే విషయాన్ని బయట పెట్టాడు.

సమంత డెడికేషన్ చాలా ఇష్టమని ..ఆమె అనుకుంటే కచ్చితంగా సాధిస్తుందని ..స్క్రీన్ పై నాకు ఆమె పెర్ఫార్మెన్స్ చాలా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సమంత తో లిప్ కిస్ బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో విడాకులు తీసుకున్న సమంత ని ఇంకా లైక్ చేస్తున్నాడు  నాగచైతన్య  అంటూ కామెంట్స్ తో నెట్టింట ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news