టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా ..రామ్ చరణ్ ఉపాసనలకు ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి . చాలా క్యూట్‌గా.. రొమాంటిక్ గా ..అన్యోన్యంగా ఉంటారు . అందుకే ఈ జంటను ఆదర్శ జంట అంటూ ఉంటారు ఇండస్ట్రీలోని పెద్దలు. మరి ముఖ్యంగా వాళ్ళ వయసు కన్నా పెద్ద వాళ్ళు కూడా ఆ జంటను చూసి ఆదర్శంగా తీసుకొని లైఫ్ లో ముందుకెళ్తున్నారు అంటే ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో.. ఎంత అండర్స్టాండింగ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .
కాగా రీసెంట్ గా ఈ జంట తమ 11వ సంవత్సర పెళ్లి రోజు ను ఘనంగా సెలబ్రేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ – ఫ్రెండ్స్ – ఫ్యామిలీ మెంబర్స్ – ఫాన్స్ అందరు విష్ చేశారు . ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన స్పెషల్ విషెస్ అందించారు . తన కొడుకు కోడలికి రామ్ చరణ్ ఉపాసనలకు స్పెషల్‌గా విష్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి .
వాళ్లని ట్యాగ్ చేస్తూ..” మీరు ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి . మీ జంట మరొకరికి ఆదర్శంగా నిలవాలి. 11 వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు . త్వరలోనే మీ లైఫ్ లోకి రాబోతున్న బేబీ కోసం రెడీగా ఉండండి. పేరెంట్స్ కాబోతున్న మీకు స్పెషల్ విషెస్ ” అంటూ పోస్ట్ చేశారు . అంతేకాదు కొడుకు కోడలికి డైమెండ్ రింగ్స్ తో పాటు త్వరలోనే పుట్టబోతున్న బేబీ కోసం స్పెషల్ డాల్ ని కూడా గిఫ్ట్ చేశారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!