ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎలా కొట్టుకొని చస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మా హీరో కత్తి అంటే ..మా హీరో తోపు అంటూ.. మా హీరో తురుము అంటూ నానాహంగామ చేస్తున్నారు . సినిమా అప్డేట్ ఇచ్చేవరకు ఒక తలనొప్పి .. అయితే సినిమా అప్డేట్ ఇచ్చినాక మా హీరో ని తక్కువ చేశారు అంటూ నానా రచ్చ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రీసెంట్గా రిలీజ్ అయిన “గుంటూరు కారం ” సినిమా యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని నిన్న సాయంత్రం 6:39 నిమిషాలకు రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ని కావాలనే టార్గెట్ చేస్తూ మరో స్టార్ హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా మహేష్ బాబు సీరియల్ యాక్టర్ అంటూ ఆయన గతంలో ఓ సీరియల్ ప్రమోషన్ చేసిన ఫొటోస్ వైరల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు .
కేవలం సీరియల్ లకే పరిమితమైన ఈ హీరో ఎక్కడా అంటూ మహేష్ బాబుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ని సైతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు .ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు . ఇప్పుడు అంతకు డబుల్ రేంజ్ లో దూసుకుపోతున్నారు. మరి ఎన్టీఆర్ ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు అంటూ దారుణంగా కౌంటర్ చేస్తున్నారు. అంతేకాదు “గుంటూరు కారం” సినిమాను మొదటిగా త్రివిక్రమ్ చెప్పింది ఎన్టీఆర్ కి అంటూ తెలుస్తుంది.
అయితే కథలో కొన్ని మార్పులు చేయమని త్రివిక్రమ్ కి చెప్పారట . అయినా కానీ ఆయన చేయకపోవడంతో ఎన్టీఆర్ ఆ సినిమాని వదులుకున్నాడని ..అలా వదిలేసిన సినిమానే మహేష్ బాబు ఖాతాలో చేరిందని ఏకిపారేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మా అన్న తోపు అంటూ రకరకాల పోల్స్ ని కండక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు .దీంతో ఎన్టీఆర్ – మహేష్ బాబుల ఫ్యాన్స్ మధ్య వార్ సోషల్ మీడియాలో పిక్స్ కి చేరుకుంది..!!