Moviesపెళ్ళికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య-వరుణ్ తేజ్.. మెగా సాంప్రదాయం...

పెళ్ళికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య-వరుణ్ తేజ్.. మెగా సాంప్రదాయం ఇదేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జూన్ 9న గ్రాండ్గా వీళ్ళిద్దరూ నాగబాబు నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు మారు మ్రోగిపోతున్నాయి . అంతేకాదు ఈ జంటకు సంబంధించిన లవ్ స్టోరీ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా లావణ్య వరుణ్ నిశ్చితార్ధం చేసుకోవడంతో చాలా మంది స్టార్ ప్రముఖులు పెళ్లికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోని వాళ్ళకి థాంక్స్ చెప్తూ వరుణ్ – లావణ్య ఓ అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. కపుల్ కాంబోలో లాగా మ్యాచ్ అవుతున్న డ్రస్సులను వేసుకుంటూ ఫారిన్ కంట్రీస్ లో నడి రోడ్డుపై షికార్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొందరు ఈ ఫోటోపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లికి ముందే హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారా..? అంటుంటే మరికొందరు దారుణాతి దారుణంగా మెగా ఫ్యామిలీకి ఇది అలవాటే కదా.. నాలుగు రోజులు తిరగడం ఐదో రోజు విడాకులు ఇవ్వడం అంటూ ట్రోల్ చేస్తునారు.

అయితే వీరిద్దరూ లేటెస్ట్ గా ఫారెన్ వెళ్ళారా లేక ఇది ఓల్డ్ ఫోటోనా అనేది క్లారిటీ లేదు. వరుణ్ తేజ్ లావణ్య ఈ పిక్ లో మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా యాదృచ్ఛికమో ఏమో కానీ విచిత్రంగా వరుణ్ తేజ్.. లావణ్య ఇద్దరి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఒకటే.. ఇద్దరికీ చెరో 3.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news