టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ ని నమోదు చేసుకుంది . మనకు తెలిసిందే ఆది పురుష్ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వగానే జనాలు ఆది పురుష్ సినిమాను ఓ రేంజ్ లో ఏకిపారేశారు . అసలు రాముడు గెటప్ లో ప్రభాస్ సూట్ అవ్వలేదని..
సీత పాత్రలో కృతి సనన్ ని చూడడమే వేస్ట్ అని.. ఈ సినిమా మొత్తం ఓ రౌత్ డైరెక్షన్ లో పెట్టి బిగ్గెస్ట్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఓ రేంజ్ లో ఏకేశారు . అంతేనా గ్రాఫిక్స్ ని చూసి బండబూతులు తిట్టారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లలో సగం మంది జనాలు సాటిస్ఫై అయిన మిగతా సగం మంది జనాలు మాత్రం అదే మాటలకు కట్టుబడి ఉన్నారు . అయితే సినిమా కథ కంటెంట్ అన్ని బాగున్నా.. కానీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ బాగోలేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.
నాసిరకమైన వి ఎఫ్ ఎక్స్ సినిమాకి నెగటివ్ టాక్ క్రియేట్ ఎలా చేసుకున్నారు అంటూ మండిపడుతున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే రాజమౌళి పేరును తెరపైకి తీసుకొచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ . ఒకవేళ ఆది పురుష్ సినిమాని ఓంరావత్ కాకుండా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించుంటే కథ వేరేలా ఉండేదని.. మరో ఆస్కార్ కన్ఫామ్ గా వచ్చుండేదని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అంటే అభిమానులకి అదో కొత్త ఫీలింగ్ కూడా ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని ఆది పురుష్ సినిమా టాక్ మరోసారి వైరల్ గా మారింది..!!