జయంతి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన నటే. అయితే.. ఆమె తొలినాళ్లలో హీరోయిన్‌గా పనిచేశా రు. ముఖ్యంగా అన్నగారితోనూ ఆమె సతీమణి పాత్రల్లో నటించారు. చక్కని హావభావాలు.. కుదురైన మాట తీరు.. స్పష్టమైన తెలుగు ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. అయితే.. తర్వాత కాలంలో ఆమె.. సైడ్ అయ్యారు. కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసిపుచ్చినట్టుగా.. జయంతి పరిస్థితి మారిపోయింది.
దీనికి కూడా ఆమె చేసుకున్న స్వయం కృతమేనని అంటారు. కొన్నాళ్లపాటు సినిమాల్లో అవకాశం రాలే దు. దీంతో ఆమె క్యారెక్టర్ పాత్రలకు కూడా కాకుండా.. గ్రూప్ డ్యాన్స్‌లో నటించారు. ఇక, అక్కడి నుంచి ఆమెకు అసలు అవకాశాలే రాలేదు. అయితే, జయంతితో పరిచయం ఉన్న అప్పటి హీరో.. కాంతారావు.. ఆమెకు తానే స్వయంగా అవకాశాలు ఇప్పించారు.
దేవిక-కాంతారావు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రాల్లో జయంతి మెరిసేవారు. అప్పట్లో దేవిక-కాంతారావుకు హిట్ పెయిర్ అనే పేరు ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన అపూర్వ చింతామణి సినిమాలో జయంతికి సైడ్ హీరోయిన్ పాత్రను కాంతారావే ఇప్పించారు. అయితే.. దీనికి కూడా ఆయన పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.
ఆమె డ్యాన్సర్ కాబట్టి తీసుకునేది లేదని దర్శకుడు ఎస్ డీ లాల్ చెప్పడంతో ఆమె డ్యాన్సర్ కాదు.. సైడ్ హీరోయిన్ కూడా కాదు.. హీరోయిన్ క్వాలిటీలు అన్నీ ఉన్నాయి.. అవకాశం ఇవ్వాల్సిందేనని కాంతారావు పట్టుబట్టి.. ఇప్పించారు. అప్పట్లో కాంతారావు ఆమె కోసం ఇలా పట్టుబట్టటం ఓ హాట్ టాపిక్. ఇలా.. జయంతికి కొన్ని అవకాశాలు దక్కాయి. తర్వాత.. మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఉండిపోయారు.