Moviesద్యావుడా..శర్వా రిసెప్షన్‌లో రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?...

ద్యావుడా..శర్వా రిసెప్షన్‌లో రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..? మెగా హీరో అనిపించాడుగా..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లల్లో ఒకరైన శర్వానంద్ రీసెంట్ గానే పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్న శర్వానంద్ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ని నిర్వహించారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ స్టార్స్ అందరూ ఫంక్షన్ కి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అంతేకాదు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఫంక్షన్ కి రావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే ఈ ఫంక్షన్ లో అందరికంటే స్పెషల్ గా కనిపించారు రామ్ చరణ్ – ఉపాసన .

ఉపాసన బేబీ బంప్ తో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ ఫంక్షన్ లో మెరిసింది. ఈ క్రమంలోనే చాలా ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాంచరణ్ ధరించిన షర్ట్ ధర 75 వేలు అంటూ తెలుస్తుంది . ఇది చాలా సింపుల్ గా కనిపించడానికి బాగుంటుంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . అంతేకాదు చరణ్ తల్చుకుంటే లక్షలు – కోట్లు ఖర్చు చేసి కూడా కాస్ట్యూమ్స్ ధరించొచ్చు.

కానీ చరణ్ కి ఎప్పుడు సింప్లిసిటీ అంటే ఇష్టమని .. అందుకే ఇలా సింపుల్ అండ్ ట్రెండీ లుక్ లో మెరవడానికి ఇష్టపడతారని మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ రామ్ చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ సినిమా గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది . ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు రామ్ చరణ్ . అన్నట్లు త్వరలోనే రామ్ చరణ్ ఫాదర్ కాబోతున్నాడు . మరికొద్ది వారాల్లోనే ఉపాసన డెలివరీ కానుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news