టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో.. ఆ ట్రోలింగ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది . ఇదే క్రమంలో ఆమె తన నెక్స్ట్ సినిమాల పైన ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఉంది . ప్రెసెంట్ సమంత శివనిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమాలో నటిస్తుంది .
అంతేకాకుండా బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది . దీంతో ఈ రెండు హిట్ అయితే సమంత పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది . కాగా ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ ను షేర్ చేసింది . సమంత మూడు పిక్స్ ని పోస్ట్ చేస్తూ “మూడ్” అంటూ క్యాప్షన్ వచ్చింది . ఈ క్రమంలోనే ఆమెను సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు జనాలు . కొందరు సింగిల్ గా ఉన్నావు నీకు మూడొచ్చిందా..? అంటుంటే.. మరికొందరు ఆ ఫోటోలోని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు కొందరు జనాలు రకరకాలుగా ఆమెను బూతులతో ట్రోల్ చేస్తున్నారు . ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియా దేశంలో జరుగుతున్నట్లు సమాచారం. సిటాడెల్ షూటింగ్ సెట్స్ లో సమంత దర్శకద్వయం రాజ్ అండ్ డీకేలలో ఒకరితో సమంత మాట్లాడుతున్నారు. ఆ ఫోటో ఆమె షేర్ చేశారు. సమంత సింగిల్ కావడంతో ఆమె తోడు వెతుక్కున్నారేమో అనే సందేహం జనాలు వ్యక్తపరుస్తున్నారు. సమంత సింగిల్ గా ఉండడంతో పైగా క్యాప్షన్ అని మూడు అని పెట్టడంతో జనాలు పెళ్లి చేసుకోబోతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు . మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మరోసారి వైరల్ గా మారింది.