సినిమా తారలు ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు ముందు నుంచే ఉంది. కొంత మంది రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తే మరి కొత్త మంది డైరెక్ట్ గా ఎలక్షన్ లో నిలపడ్డారు. ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ అంటే గుర్తొచ్చేది టిడిపి పార్టీ అనే చెప్పాలి. సినిమా తారలకు ఈ పార్టీకి వీడిపోని బంధం ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఆయనతో పాటు చాలా మందిని రాజకీయాల్లోకి తెచ్చారని చెప్పొచ్చు.
అయితే ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే వార్తలు ఇప్పటికి వైరల్ అవుతుంటాయి. మొదట్లో చంద్రబాబు కూడా గ్లామర్ కి రాజకీయాల్లో కాలం చెల్లింది అని కామెంట్ చేశారనే టాక్ కూడా ఉంది. అయితే కొంత మంది రాజకీయ నాయకులు సినీ తారల గ్లామర్ ని వాడుకొని ఆ తరువాత కూరల్లో కరివేపాకులా తీసి పారేసిన కొన్ని సందర్పాలపై ఒక లుక్ వేద్దాం.
ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న సినీ హీరోల్లో పవన్ కళ్యాణ్ పేరు ముందుంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గ్లామర్ ని కూడా చంద్రబాబు వాడుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి కూడా ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.
అయితే రాజకీయాల్లో రాణించలేకపోవడంతో చిరంజీవి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు. కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా టిడిపి పార్టీకి సపోర్ట్ చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. టీడీపీ పార్టీ హిమాయత్ నగర్ లో ఉన్న టైం లో రాజేంద్ర ప్రసాద్ ఆఫీస్ కి వచ్చేవారంట. అయితే రాజేంద్ర ప్రసాద్ కి విజయవాడ లో స్థలం సమస్య ఉంది. అందుకే బాబు చుట్టూనే తిరిగారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఇక కైకాల సత్యనారాయణ ఒకసారి గెలిచారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు అవకాశం రాలేదు. కైకాల సత్యనారాయణ అప్పట్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కి రాజకీయం నేర్పింది తానే అంటూ ఎదో చెప్పే ప్రయత్నం చేసారు. ఆ తరువాత రామానాయుడు కూడా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఒకసారి గెలిచారు కూడా. అయితే ఆ తరువాత మళ్ళీ రాజకీయం జోలికి వెళ్ళలేదు. ఇక మురళి మోహన్ అయితే టిడిపిలో చాలా ఏళ్ళ పాటు ఉన్నారు.