Movies"అలా చేస్తే చిరాకు..నాకు అస్సలు నచ్చదు".. పాపం జాకీ భగ్నాని ..చచ్చాడు...

“అలా చేస్తే చిరాకు..నాకు అస్సలు నచ్చదు”.. పాపం జాకీ భగ్నాని ..చచ్చాడు పో..!!

రకుల్ ప్రీత్ సింగ్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ.. క్లాస్ మాస్ బోల్డ్ అంటూ తేడా లేకుండా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలతో బాలీవుడ్ లో సత్తా చాటుకోవడానికి ట్రై చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ..సూపర్ సక్సెస్ అయింది .

ప్రెసెంట్ బాలీవుడ్ టాప్ మోస్ట్ పొజిషన్లో రాజ్యమేలేస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నాని తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . సోషల్ మీడియాలో వీళ్ళ గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ గా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా ప్రేమలో ఇలాంటి తప్పులు చేయకూడదు అంటూ సంచలన కామెంట్స్ చేసింది .

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ..” ప్రేమకు పెద్ద శత్రువు అబద్ధం. అబద్దం అంటే నాకు చాలా చిరాకు ..ఇద్దరు వ్యక్తుల ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా దాపరికం ఉండకూడదు . అలా చేస్తే నేను అస్సలు భరించలేను – సహించలేను. వారి ప్రేమ ఎక్కువకాలం కూడా నిలవదు ” అంటూ బోల్డ్ గా స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ వైరల్ గా మారాయి. ఎప్పుడైనా సరే ఆమె దగ్గర జాకీ ఏ విషయం అయినా దాచితే రకుల్ ప్రీత్ సింగ్ కోపానికి బలి అయిపోవాల్సిందే అంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news