ఇతర నటీమణులకు.. భానుమతికి చాలా తేడా ఉంది. ఎంత అభినయం ఉందో.. అంతే గర్వం ఉన్న నటీమణి. ఎంత అందం ఉందో.. అంతే.. పొగరు కూడా ఉన్న హీరోయిన్. మనసులో ఏది అనుకుంటే.. అది.. వెంటనే నోటి నుంచి వచ్చేసేది. ఎవరో ఏదో అనుకుంటారు.. మనం జాగ్రత్తగా ఉండాలి.. అనే టైపు మనిషి ఏమాత్రం కాకపోవడం గమనార్హం. తాను అనుకున్నది ఆమె చెప్పేస్తుంది. తాను చేయాలని అనుకున్నది చెప్పేస్తుంది.
అటు వైపు ఎంత గొప్ప స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నా కూడా భానుమతి వాళ్లకు మనం ఏ మాత్రం తీసిపోం… మనదే పై చేయి అన్నట్టుగా ఆమె బిహేవియర్ ఉండేదట. సెట్స్‌లోనూ ఆమె అలాగే భీకరంగా ఉండేవారట. ఆమెను ఎవరైనా డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తే అస్సలు సహించే వారు కాదంటారు.
అందుకే భానుమతి అంటే. అమ్మో అనే నటులు, హీరోలు సైతం ఉన్నారు ఆరోజుల్లో.
ఎంత నటుడైనా.. ఎంతటి కళాకారుడైనా.. భానుమతి లైన్ లో ఉన్నారంటే.. ఒకింత జాగ్రత్తగానే మసులు కునేవారట. ఇలాం టి భానుమతి.. నటన విషయానికి వస్తే.. ఎక్కడా రాజీ పడేవారు కాదు. డైలాగుల నుంచి అభినయం వరకు తెలుగు ఉట్టి పడాల్సిందే. తెలుగుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. తనే పాటలు రాసుకుని పాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడంలో భానుమతి ముందున్నారనే చెప్పాలి. అయితే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని కొన్ని సినిమాల్లో మాత్రం భానుమతి రాజీపడడాల్సి వచ్చింది. డబుల్ మీనింగ్ డైలాగులు పలకాల్సి వచ్చింది. తప్పని..చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా.. మంగమ్మ గారి మనవడు, బామ్మబాట బంగారు బాట.. వంటి సినిమాల్లో భానుమతి రాజీ పడాల్సి వచ్చిందని అంటున్నారు.
ఈ రెండు సినిమాల్లోనూ భానుమతి నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లాయి. అయితే. ప్రేక్షకులు ఆమె నటనతోపాటు.. ఈ డైలాగులను కూడా ఆస్వాదించడం విశేషం.