గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ ని వినిపించింది మెగా కోడలు ఉపాసన . పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ళు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 20 న తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు ఉపాసన పాప అపోలో హాస్పిటల్స్ లో జన్మించింది . ఈ క్రమంలోని ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .
ఇంటికి మహాలక్ష్మి పుట్టడంతో సంబరాలు చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. కాగా ఇలాంటి క్రమంలోనే తల్లులు అందరికీ ఉపాసన స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. తన బిడ్డ కోసం తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేస్తూ మీరు మీ బిడ్డ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోండి అంటూ సజెస్ట్ చేసింది. ఉపాసనకు పుట్టిన బిడ్డ బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వద్ద సేఫ్‌గా దాచి పెట్టేసింది.
ఇలా రక్తం దాచిపెట్టడం అనే దాని.. అంబిలికల్ కార్డ్ బ్లడ్ అని అంటారు. అయితే ఈ బొడ్డుతాడు రక్తం ఎందుకు దాచారు అనేది తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నా బిడ్డ బొడ్డును ప్లసెంటా తో బొడ్డుతాడు కలుపుతుంది ఈ విషయం మన అందరికి తెలిసిందే. ఇక దీని ద్వారానే తల్లి కడుపులో ఉన్నా బిడ్డకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ వెళ్తాయి. కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చినప్పటికీ.. బొడ్డుతాడు ద్వారా బిడ్డ ప్లసేంటా కు అనుసంధానమై ఉంటుంది. పుట్టిన బిడ్డకు ప్లసెంటా నుంచి వేరు చేయడానికి ఈ బొడ్డుతాడును కత్తిరించి ముడి వేస్తారు.
ఆ ముడి తీసిన తర్వాత బిడ్డ బొడ్డుకు కలిసి ఉండే మిగిలిన చిన్న బొడ్డు తాడు.. ఐదు లేదా 15 రోజుల్లో ఎండిపోయి నల్లగా మారి ఊడిపోతుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బొడ్డుతాడు, ప్లసెంటా లోని మూల కణాలను దాచి పట్టడం కార్డు బ్లడ్ బ్యాంకింగ్ అని అంటారు. ఇక ఈ కణాలను లుకేమియా, తలెమియా, మాయ లోమాస్, లింపోమా లాంటి వ్యాధులను వచ్చినప్పుడు ఇది ఉపయోగిస్తే తొలగిస్తుందట. బొడ్డు తాడు లోని రక్తాన్ని ప్రిజర్వ చేసేందుకు ఒక్కో సంస్థ సుమారు 20 సంవత్సరాలు దాచడానికి 25000 నుంచి 50000 తీసుకుంటారట. అదేవిధంగా 75 సంవత్సరాల అయితే మొత్తంగా 70000 ఛార్జ్ చేస్తారట. ఇలా ఉపాసన తన బిడ్డ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంది..!!