సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడుపుతుందని .. త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వినిపించినప్పటి నుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠికు సంబంధించిన పలు రకాల ఫొటోస్ వైరల్ అయ్యాయి .
కాగా ఎట్టకేలకు జూన్ 9వ తేదీ గ్రాండ్గా నాగబాబు నివాసం లో నిశ్చితారధం చేసుకుంది ఈ జంట. ఆ ఫొటోస్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . కాగా రీసెంట్గా లావణ్య త్రిపాఠి తన ఫోన్ వాల్ పేపర్ ను చేంజ్ చేసింది . అదే విషయాన్ని ఇన్ స్టా స్టోరీ లో షేర్ చేసింది. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేక సందర్భాల్లో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి .
ఆ పిక్ లో తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ కూడా చాలా రొమాంటిక్గా స్టిల్ ఇచ్చిన ఫోటో ఉంది. దీంతో దీన్ని పోస్ట్ చేస్తూ “మై లవ్ డ్రీమ్ బిగ్గర్” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది . దీంతో మెగా కోడలు పిల్ల ఇంత ఫాస్ట్ నా..? అప్పుడే వాల్ పేపర్ ని కూడా మార్చేసింది ..అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు లావణ్య త్రిపాఠి- వరుణ్ ల జంట ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కోరుకుంటున్నారు..!!