టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న .. కాజల్ అగర్వాల్ ఎంత క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన కాజల్ తనదైన స్టైల్ లో దూసుకుపోతూ టాప్ హీరోయిన్గా మళ్లీ తన స్థానాన్ని దక్కించుకోవడానికి తెగ ట్రై చేస్తుంది.
కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులుని పెళ్లి చేసుకున్న కాజల్, పండు లాంటి బాబుకి జన్మనిచ్చేసింది. అయితే కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్న టైంలోనే గౌతమ్ కిచ్చులు తో పెళ్లికి ఫిక్స్ అయింది . ఆ టైంలో కాజల్ ఒకే ఒక క్రేజీ కండిషన్ పెట్టారట . ” నువ్వు సినిమా షూట్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఎంత టఫ్ సిచువేషన్ లో ఉన్న డైలీ ఒక గంట నాతో టైం స్పెండ్ చేయాలని” చెప్పుకొచ్చారట . అదే నీ దగ్గర వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ అప్పట్లో ఆమెకు కండిషన్ పెట్టారట.
అయితే భర్త కండిషన్ చాలా స్వీట్ గా ఉండడంతో కాజల్ ఒప్పేసుకుంది . అయినా సరే కాజల్ ఇప్పటికే ఆ కోరికను తీర్చలేక పోతుందట. కాజల్ ఓ పక్క బాబుని చూసుకుంటూ మరోపక్క బిజీ షెడ్యూల్ తో ముందుకెళ్తుంది. గౌతమ్ కిచ్చులు కూడా బిజినెస్ పని మీద ముందుకు వెళ్లిపోతున్నారు . ఈ క్రమంలోనే గౌతమ్ కిచ్చులు కోరికను కాజల్ తీర్చలేక పోతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!