Moviesజీవితంలో మందు తాగ‌న‌ని ఏఎన్నార్ మంగ‌మ్మ శ‌ప‌థం... ఇంత పెద్ద క‌థ...

జీవితంలో మందు తాగ‌న‌ని ఏఎన్నార్ మంగ‌మ్మ శ‌ప‌థం… ఇంత పెద్ద క‌థ ఉందా…!

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో అనేక శప‌థాలు చేశారు. సినిమా రంగానికి సంబంధించి ఈ పాత్ర నేను చేయను ఈ వేషాలు నేను వేయను అని ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చే ఆయన ముందు నిలబడి అడిగినా కూడా ఆయా పాత్రలు ఆయన ధరించకపోవడం చాలా చాలా విశేషమే.

నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇస్తే రాజీ పడినటువంటి నటులు కనిపిస్తారు. ఉదాహరణకు సావిత్రి తీసుకున్నట్లయితే వేశ్య పాత్రను నటించమని చెప్పినటువంటి సావిత్రి తర్వాత అన్నగారు చెప్పినటువంటి మాట విని క‌న్యాశుల్కం చిత్రంలో వేశ్య పాత్రని నటించింది. అలా కొంతమంది నటులు కొన్ని కొన్నిచోట్ల‌ రాజీ పడ్డారు. కానీ, అక్కినేని నాగేశ్వరరావు మాత్రం తన జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వ్య‌వ‌హరించారు.

ఆయన ధరించినటువంటి పాత్రలో ముందుగానే ఒక అవగాహన పెంచుకొని ముందుగానే స్క్రిప్ట్ ని చదివి డైలాగులను కూడా ఒంట‌బ‌ట్టించుకుని ఆయన ఆ పాత్రలో జీవించారు. ఇలా అక్కినేని విజయాలతో పాటు అక్కినేని చేసిన శపథాలు కూడా ఆయన జీవితంలో చర్చికి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు భూకైలాస్ లో అన్నగారితోపాటు అక్కినేని నటించారు. ఈ సినిమాలో అక్కినేని పాత్ర కీలకం ప్రతి ప్రేమ్‌లోనూ దాదాపు కనిపిస్తూనే ఉంటారు. ఆయన నారదుడి పాత్ర వేశారు.

అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నా కూడా అట్టర్ ప్లాప్ అయిపోయింది. ప్రేక్షకులు భ‌రించ‌లేక పోయారనే టాక్ వినిపించింది. దీంతో అక్కినేని తన జీవితంలో ఇక నార‌ద‌ పాత్రవ‌దులుకున్నారు. అవకాశం వచ్చినా కూడా నిర్మొహమాటంగా నారద పాత్ర వేయను అని చెప్పేసారు. అదేవిధంగా పౌరాణిక చిత్రాల్లో కూడా అక్కినేని నటించ‌డం మానేశారు. దీని కారణం పౌరాణిక చిత్రాలకు తన బాడీకి, హావభావాలకు పొంతన ఉండదని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ క్రమంలో ఒకానొక దశలో 1970 నుంచి 1980 మధ్యకాలంలో మూడు నాలుగు సంవత్సరాలు పాటు పౌరాణిక చిత్రాలే నడిచినా కూడా అక్కినేని నాగేశ్వరరావు సంవత్సరానికి ఒక సినిమా వచ్చినా చాలు నేను పౌరాణి చిత్రాలు మాత్రం నటించను నాకు సాంఘిక చిత్రాలు సరిపోతాయి అని చెప్పి ఆయన అలాగే శ‌ప‌థం చేసి అలాగే ఉండిపోయారు. ఇక, హాస్య నటుడు రాజబాబు విషయాన్ని సినీ ఇండస్ట్రీ పెద్ద గుణపాఠంగా రోజుల్లో తీసుకునేది.

ఆయన మద్యానికి బానిస కావడం మద్యం సేవించే షూటింగ్ కి రావడం అంటే తీవ్ర చర్చ నీయాంశంగా మారేది. దీంతో ఇట్లాంటి అనుభవాలను చూసినటువంటి అక్కినేని నాగేశ్వరరావు తన జీవితంలో మద్యం ముట్ట‌న‌ని చెప్పి శప‌థం చేసి జీవితాంతం అలాగే వ్యవహరించారు. ఆయన నిబద్ధత ఈనాటికి కూడా ఇండస్ట్రీలో ఒకరిద్ద‌రు పాటిస్తూనే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news