టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోనే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది .
సినీ ఇండస్ట్రీని బ్లాస్ట్ చేసింది . కాగా ఇలాంటి క్రమంలోనే చాలా బోల్డ్ గా నటించే అల్లు అర్జున్ ..ఓ హీరోయిన్ పెళ్లి అయిపోతే రూమ్ లో కూర్చొని గుక్క పట్టి ఏడ్చేసాడట . రెండు రోజులు అన్నం కూడా తినలేదట . ఇదే న్యూస్ వైరల్ గా మారింది . మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకున్న టైం లో అల్లు అర్జున్ చాలా డిప్రెషన్ కి లోనై పోయారట .
మొదటి నుంచి ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం ఉన్న అల్లు అర్జున్ ఆమెతో ప్రేమలో పడిపోయారట . అయితే ఆమె అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకోవడంతో అల్లు అర్జున్ చాలా డిప్రెషన్ కి లోనైపోయాడట . రెండు రోజులు అన్నం తినకుండా ఏడ్చాడట. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు అల్లు అర్జున్ . “నా పెళ్లయిపోతే నా లేడీ ఫ్యాన్స్ ఎలా బాధపడ్డారో.. అంతకు ట్రిపుల్ రేంజ్ లో ఐశ్వర్య రాయ్ పెళ్లి అయిపోతే నేను బాధపడ్డాను ” అని చెప్పకు వచ్చాడు. ఈ విషయం స్నేహారెడ్డి కి కూడా తెలుసు అని చెప్పడం గమనార్హం..!!