Moviesఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ పై నోరు విప్పిన ఇలియానా ..కడుపులోని బిడ్డకు...

ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ పై నోరు విప్పిన ఇలియానా ..కడుపులోని బిడ్డకు తండ్రి ఆయనే..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన ఇలియానా.. ఏ మాత్రం భయం బెరుకు లేకుండా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రెగ్నెన్సీ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ..ఎలాంటి ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి అంటూ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు ఇలియానా . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇలియానా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇలియానా తన కడుపులోని బిడ్డకు తండ్రి గురించి వివరిస్తూ చాలా ఎమోషనల్ గా స్పందించింది . “తల్లి కావడం ఓ గొప్ప విషయం .. మన శరీరంలో ప్రాణికి జీవం పోయడమంటే అది ఒక గొప్ప ఫీలింగ్ . అది అనుభవిస్తే కానీ తెలియదు. అలాగే నాకు ఎన్నో కష్టనష్టాలలో ఓ వ్యక్తి తోడున్నాడు .. నా బాధనుండి.. నా వేదన నుండి బయట పడేలా చేశాడు ..అండగా నిలిచి నా లైఫ్ కి ఓ మార్గం చూపించాడు . నా లైఫ్ లో నవ్వులు పూయించాడు..” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది .

అయితే అతగాడి పేరు మాత్రం చెప్పలేదు . దీంతో ఇలియానా కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరు..? అంటూ మరోసారి న్యూస్ వైరల్ గా మారింది . అంతే కాదు హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో సహజీవనం చేసిన ఇలియాన గర్భం దాల్చారు అనే వాదన ఇప్పటికీ వినిపిస్తుంది . బహుశా బిడ్డ పుట్టాక తన తండ్రిని అఫీషియల్ గా ప్రకటిస్తుందేమో ఇలియానా చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news