Moviesమెగా మనవరాలా మజాకా..బారసాల ఫంక్షన్ కి వచ్చిన అందరికి కళ్ళు చెదిరే...

మెగా మనవరాలా మజాకా..బారసాల ఫంక్షన్ కి వచ్చిన అందరికి కళ్ళు చెదిరే బంగారు గిఫ్ట్ లు ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా మనవరాలు బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి చిరంజీవి కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో గిఫ్ట్లను రెడీ చేశారట . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కి మనవరాలు పుట్టింది . మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ కు జూన్ 20న రాత్రి ఒంటిగంట 49 నిమిషాలకు అమ్మాయి పుట్టింది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన డెలివరీ అయింది .

మంగళవారం రోజు పాప పుట్టడంతో ఆమెకు ఆంజనేయస్వామి పేరు కలిసి వచ్చేలా ఈరోజు నామకరణం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ వీడియోస్ ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా చాలా ట్రెడిషనల్ గా చాలా పద్ధతిగా మెగా మనవరాలు పేరు పెట్టబోతున్నట్లు డెకరేషన్ చూస్తేనే అర్థమవుతుంది . తాటాకులతో ..కొబ్బరి చిప్పలతో.. ఒరిజినల్ ఫ్లవర్స్ తో చాలా ట్రెడిషనల్ గా డెకరేట్ చేసిన లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది .

మరి కొద్ది క్షణాల్లోనే రామ్ చరణ్ ఉపాసన పాపకు పేరు పెట్టబోతున్నారు . కాగా ఇదే క్రమంలో ఉపాసన చరణ్ పాప బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ చేస్తున్నారట . మెగా మనవరాలు పుట్టిన శుభ సందర్భంగా ఇలా తన మనవరాలు పై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారట . ఏది ఏమైనా సరే మెగా మనవరాలు అందరికన్నా చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ చెప్పకనే చెప్పేస్తున్నారు . ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఇంత మంది మహాలక్ష్మి లాంటి పిల్లలు పుట్టిన ఏనాడు చిరంజీవి ఇలాంటి పని చేయలేదు . చరణ్ కూతురికి మాత్రమే చేస్తున్నారంటే ఎంత స్పెషల్ నో అర్థం చేసుకోండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news