Moviesఫైనల్లీ..అనుకున్నది సాధించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇక దబిడి దిబిడే..!!

ఫైనల్లీ..అనుకున్నది సాధించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇక దబిడి దిబిడే..!!

రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతో జతకట్టింది . మరి ముఖ్యంగా చరణ్ – మహేష్ బాబు – బన్నీ లాంటి స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్..

ప్రజెంట్ టాలీవుడ్ లో డిజాస్టర్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా అందుకోలేకపోయింది . అయితే ఎట్టకేలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయణాన్ని కొనసాగించాలని అని తీసుకున్న డెసీషన్ తో ఫుల్ గా సక్సెస్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ నరసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న ఎన్.బి.కె 109 .

ఈ సినిమాలు సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా నయనతారను చూస్ చూసుకున్నారుట బాబి . సెకండ్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ సెలెక్ట్ అయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తానికి అనుకున్న విధంగా టాలీవుడ్లో మళ్లీ పాగ వేయడానికి ట్రాక్ రెడీ చేసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news