సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎలా వరుస సినిమాలతో స్వింగ్ మీద దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు తారక్. ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్న తారక్ ఓ వైపు సినిమాలో చేస్తూనే .. మరోవైపు అడ్వర్టైజ్మెంట్ లోను నటిస్తున్నాడు .
తాజాగా మెక్ డొనాల్డ్స్ తాడ్స్ లో కూడా ఎన్టీఆర్ నటించాడు . దీనికి సంబంధించిన యాడ్ రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యి అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది . అయితే 30 సెకండ్స్ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు ఎన్టీఆర్ అడగకుండానే మెక్ డోనాల్డ్ సంస్థ అంత భారీనరేషన్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ యాడ్ కోసం తారక్ 10 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తుంది . ఇది మొత్తం కూడా ఎన్టీఆర్ రేంజ్ బట్టి వాళ్లే ఆయన అడగకుండా ఇచ్చారట . 30 సెకండ్లు యాడ్ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే ఎన్టీఆర్ రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు టాలీవుడ్ లో అందరికంటే హైయెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ తీసుకున్నింది ఎన్టీఆర్ మాత్రమే అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కి ఈ స్థాయి క్రేజీ రావడానికి కారణం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడమే అంటూ జనాలు ట్రెండ్ చేస్తున్నారు . మరికొందరు ఎన్టీఆర్ రేంజ్ అంటే అదే .. ఆయన నటిస్తే ఏదైనా సరే సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు . ప్రెసెంట్ ఎన్టీఆర్ “దేవరా” అనే సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటి జాన్వి కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తుంది . ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడు తారక్. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలను లైన్లో పెట్టేసాడు ఎన్టీఆర్..!!