సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న నందమూరి పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ తర్వాత నటసింహం.. ఇప్పుడు గ్లోబల్ లైన్ గా పాపులారిటీ సంపాదించుకుని సినీ ఇండస్ట్రీని తన సినిమాలతో షేక్ చేస్తున్నాడు. కుర్ర హీరోలే మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్న క్రమంలో ఏడాదికి రెండు సినిమాలని అనౌన్స్ చేస్తూ.. సెట్స్ పైకి తీసుకొస్తూ ..అంతే త్వరగా సినిమాల్ని రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు .
ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో బాలయ్యకు సంబంధించిన ఓ స్పెషల్ న్యూస్ వైరల్గా మారింది . మనకు తెలిసిందే బాలయ్యకు కోపం ఎక్కువ . ఆ కోపాన్ని చూస్తే చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు . అయితే ఆ కోపాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది బాలయ్య భార్య వసుంధర అంటూ సరికొత్త న్యూస్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే బాలయ్య వసుంధరలది పెద్దలు కురిర్చిన వివాహం .
అయితే పెళ్లి చూపుల్లో నే బాలయ్య తనకి కోపం ఎక్కువ అని చెప్పారట. అదే విషయం వసుంధరికి ఆల్రెడీ ముందే బంధువులు చెప్పుకున్నారట . ఈ క్రమంలోని చాలామంది బాలయ్య కోపాన్ని చూసి భయపడుతూ ఉన్నా కానీ బాలయ్యలోని ఆ కోపమే వసుంధర కి నచ్చి ఆయన్ని పెళ్లి చేసుకుందట. పెళ్లిచూపుల్లో చూసిన ఐదు నిమిషాల్లోనే బాలయ్య అంటే విపరీతమైన ప్రేమ కలిగిందట . ఆయన తనను జీవితాంతం సంతోషంగా చూసుకోగలరు అన్న నమ్మకం కలిగి స్పాట్లోనే బాలయ్యను భర్తగా యాక్సెప్ట్ చేసిందట. ఆనాడు మొదలు ఈనాడు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలయ్యచెయ్యిని వదల్లేదు వసుంధర ..ఇలాంటి దంపతులే నేటి జనరేషన్ కి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు..!!