Moviesలావణ్య-వరుణ్ పెళ్ళి ముందే అలాంటి అగ్రిమెంట్ పై "సైన్" చేశారా..? ఇండస్ట్రీని...

లావణ్య-వరుణ్ పెళ్ళి ముందే అలాంటి అగ్రిమెంట్ పై “సైన్” చేశారా..? ఇండస్ట్రీని షేష్ చేస్తున్న లీక్డ్ న్యూస్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లికి ముందే అలాంటి అగ్రిమెంట్ పై సైన్ చేశారా..? అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా పాపులర్ కి సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి జూన్ 9న ఘనంగా నాగబాబు నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి .

ఈ క్రమంలోనే లావణ్య – వరుణ్ ల మధ్య ప్రేమాయణం ఎలా మొదలైంది అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ లవ్ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ చర్చలు మొదలయ్యాయి . ఈ క్రమంలోనే లావణ్య – వరుణ్ పెళ్లికి ముందే ఓ అగ్రిమెంట్ పై సైన్ చేశారు అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి తెగ హల్చల్ చేస్తుంది. లావణ్య కు వరుణ్ కొన్ని కండిషన్స్ పెట్టాడట . ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే లావణ్యను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో లావణ్య కూడా ఆ కండిషన్స్ న్యాయబద్ధంగా ఉండడంతో ఓకే చేసిందట. అంతే కాదు లావణ్య కూడా వరుణ్ కి ఒక్క కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ ఒప్పుకోవడంతో ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పారు .

అయితే ఇంట్లో చెప్పాక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ కారణంగా పెళ్లి తర్వాత వీళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలని అనుకుంటే .. ఇద్దరికీ సంబంధించిన ఆస్తిలో ఎవరికీ హక్కు ఉండకుండా ఉండేలా అగ్రిమెంట్ రెడీ చేసి దానిపై సైన్ చేశారట. లావణ్య త్రిపాఠి ఆస్తులపై వరుణ్ తేజ్ కు ..వరుణ్ ఆస్తులపై లావణ్య కు ఎటువంటి అధికారం ఉండదని వాళ్ళు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న దానిపై మాత్రమే వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయని స్పెషల్ అగ్రిమెంట్ రాయిచ్చి మరి సైన్ చేయించుకుందట మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఎవరైనా పెళ్లి చేసుకుంటే పదికాలాలపాటు చల్లగా ఉండాలని చేసుకుంటారు .. మీరేంటి ఎప్పుడూ విడాకులు తీసుకోవడానికి ఇప్పటినుంచి సిద్ధమవుతున్నారు ..అంటూ ఏకిపారేస్తున్నారు..!! దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news