సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి చెరగని పొజిషన్ క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు . ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ అల్లు అరవింద్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా రాజ్యమేలేస్తున్నాడు . అల్లు అరవింద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి హీరోగా ఇచ్చిన పెద్దగా క్రేజ్ పాపులారిటీ దక్కించుకోలేకపోయాడు.
ఇప్పటికి ఇండస్ట్రీలో అల్లు శిరీష్ పేరు తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే అంతటి పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఇండస్ట్రీలో ఎందుకు ఎదగపోలేకపోయాడు..? అసలు ఇండస్ట్రీలో ఎందుకు అల్లు శిరీష్ కనిపించడం లేదు ..? మెగా ఫ్యామిలీలో ఫంక్షన్ అయినా ..శుభకార్యం అయినా ప్రతి దానికి స్కిప్ చేస్తూనే వస్తున్నారు. ఒకానొక సందర్భంలో అల్లు అరవింద్ – అల్లు శిరీషల మధ్య వార్ ఎక్కువైపోయి ఆయనను ఇంట్లో నుంచి పంపించేశారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి.
అయితే రీసెంట్గా లావణ్య -వరుణ్ ని నిశ్చితార్ధంలోను అల్లు శిరీష్ కనిపించలేదు. మెగా ప్రిన్సెస్ పుట్టినా కూడా హాస్పిటల్ కి అల్లు శిరీష్ రాలేదు . ఈ క్రమంలోనే అల్లు అరవింద్ – అల్లు శిరీష్ తో తెగదెంపలు చేసేసుకున్నారని .. ఆయన ముంబైలో ఉంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అల్లు శిరీష్ కెరియర్ పై అరవింద్ ఫోకస్ చేయకపోవడం ..సినిమాల్లో రిస్క్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోవడం కారణంగానే అరవింద్ – శిరీష్ మధ్య వార్ మొదలైంది అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి అల్లు అరవింద్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే అల్లు శిరీష్ విషయంలో కూడా ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూ ఆలోచించుకొని సినిమా నిర్మిస్తారా..? తన కొడుకు కి మార్కెట్ లేదు అని తెలిసి మంచి కధను వేరే హీరోతో నిర్మిస్తారా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో అల్లు శిరీష్ కి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి..!!