Moviesit's Official: నట"సింహం" టైం ఆగయా.. బాక్స్ ఆఫిస్ ని బద్ధలు...

it’s Official: నట”సింహం” టైం ఆగయా.. బాక్స్ ఆఫిస్ ని బద్ధలు కొట్టడానికి బాలయ్య బాబు వచ్చేస్తున్నాడహో..!!

టాలీవుడ్ నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా ఎన్.బి.కె 108. మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఎంతలా అంటే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? ఎప్పుడెప్పుడు చూద్దామా..? అంటూ కాచుకుని కూర్చున్నారు నందమూరి అభిమానులు . కాగా ఆ టైం దగ్గరికి వచ్చేసింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం .

జూన్ 8న బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని లాంఛ్ చేయబోతున్నామంటూ ఒక క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పేరు మరోసారి వైరల్ గా మారింది. కాగా వీరసింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే కావడంతో జనాల్లో దీనిపై మరింత ఆశలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో శ్రీ లీల కూతురు పాత్రలో కనిపిస్తూ ఉండడం కాజల్ తల్లి పాత్రలో బాలయ్యకు జోడిగా నటిస్తూ ఉండడం సినిమాకి హైలెట్ అని చెప్పాలి.

అంతే కాదు ఎప్పుడూ ఫ్యాక్షన్ .. మాస్ కథలతో చూసిన బాలయ్యని ఫస్ట్ టైం కామెడీ జోనర్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో చూడబోతూ ఉండడంతో ఫాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది . ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాకి “భగవంత్ లాల్ కేసరి” అనే టైటిల్ ని పెట్టారట. ఫిలిం ఛాంబర్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంటూ తెలుస్తుంది . దీన్నే అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి జూన్ 8కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు చిత్ర బృందం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చూడాలి మరి జూన్ 8న ఈ టైటిల్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ఎలా రచ్చ రంబోలా చేయబోతున్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news