సాధారణంగా.. ఏ రాష్ట్రంలో నటులు.. ఆ రాష్ట్రానికే పరిమితం. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజు ల్లో అయితే.. ఇది మరింత ఎక్కువగా ఉండేది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఎన్టీఆర్, అక్కినేని వంటివారు కూడా కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత కాలంలో సావిత్రి మాత్రమే తమిళనాడులో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రాణించారు.
తర్వాత తరానికి వచ్చేసరికి మల్టీ లాంగ్వేజ్ సినిమాలు పెరిగాయి. ఒక భాషలో తీసిన సినిమాను డబ్బింగ్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో పరభాషా నటులకు.. ప్రాధాన్యం పెరిగింది. ఇదిలా వుంటే.. తెలుగు సినిమాల్లో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న సమయంలోనే భానుప్రియ చేసిన సినిమా లు మలయాళం సహా తమిళంలోనూ డబ్బయ్యాయి. ఆమె కళ్లు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
కేరళ సినిమాల్లో అప్పట్లో ఇంత రేంజ్‌లో అందమైన హీరోయిన్లు లేరనే చెప్పాలి. దీంతో భానుప్రియకు ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది. తర్వాత తర్వాత.. భానుప్రియకు కేరళ సినిమాల నుంచి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. భారీ పారితోషికంతో పాటు.. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇలా.. తెలుగులో కంటే కూడా.. భానుప్రియకు మలయాళంలో అభిమానులు పెరగడంతోపాటు.. నిర్మాతలు కూడా క్యూ కట్టారు.
దీంతో తెలుగులో ఒక రేంజ్‌లో ఉన్న సమయంలోనే భానుప్రియ మలయాళ సినిమాల్లో కూడా నెంబర్ 1 హీరోయిన్ అనిపించుకుందంటే ఆశ్చర్యం వేస్తుంది. మలయాళ నిర్మాతతో భానుప్రియ డేటింగ్ చేయడం.. అప్పట్లో సంచలనంగా మారింది.