ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు మీరు పోతున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్.. మరి ముఖ్యంగా లేడీస్ లేడీ స్టార్స్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేయాలనుకుంటే దారుణంగా పర్సనల్ విషయాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు .
రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్ . వరుసగా బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళీ బ్యూటీ ప్రెసెంట్ రెండు సినిమాల్లో నటిస్తుంది అయితే అమ్మడు హిట్ల అందుకున్న సరే స్టార్ హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు ఓ నెటిజన్. ” నీది హీరోయిన్ ఫిగర్ కాదు ..నువ్వు హీరోయిన్ కి పనికిరావు.. అందుకే నీకు స్టార్ హీరోలు సినిమా ఇవ్వట్లేదు” అంటూ ఓపెన్ గా చెప్పారు .
అయితే ఏమాత్రం కోప్పడని అనుపమ పరమేశ్వరణ్..” ఎస్ అన్నా మీరు చెప్పింది నిజమే. నేను హీరోయిన్ ఫిగర్ కాదు ..నాది నటి ఫిగర్.. నేను నటిగానే గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాను ..నేను అందుకు పనికిరాను” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో అనుపమ పరమేశ్వరన్ కూడా నెటిజన్ లాగే సిగ్గు లేకుండా ఆయన అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు అనుపమను వెనకేసుకొస్తున్నారు కొందరు జనాలు..పొగిడేస్తున్నారు .. మరికొందరు ఇంత కోపం ఉంటే నువ్వు ఇండస్ట్రీలో అస్సలు ఎదగలేవు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!